యాదగిరీశుడి సేవలో మంత్రి కోమటిరెడ్డి

– సౌకర్యాల కల్పనపై నివేదిక పంపండి
– ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో అర్యకులు వేద ఆశీర్వచనం చేయగా స్వామి వారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాలను ఈవో వెంకట్రావు అందజేశారు. అనంతరం అతిథి గృహంలో ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల వసతి, సదుపాయాలకు సంబంధించి ఈవో వెంకట్రావు, జిల్లా కలెక్టర్‌ హనుమంత రావు, ఇంజనీరింగ్‌ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి వెంకట్రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ దేవస్థానానికి సంబంధించి పెండిరగ్‌లో ఉన్న బకాయిలపై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేస్తామన్నారు. కొండపైన భక్తులు నిద్ర చేసేందుకు పూర్తిస్థాయిలో డార్మెటరి హల్స్‌ నిర్మాణం, ఆలయంలో దాతల ద్వారా నిర్మాణం జరిగే అతిధి గృహాలకు సంబంధించి, పెండిరగ్‌లో ఉన్న పనులు, సోలార్‌ ద్వారా విద్యుత్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి వెంటనే సమర్పించాలని ఆదేశించారు. వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బడ్జెట్‌ మంజూరు చేయించి అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యేలా చూస్తానని తెలిపారు. భక్తులకు అన్నదానం చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి దీనికి సంబంధించి విధివిధానాలతో నివేదిక ఇవ్వాలన్నారు. భక్తులకు సదుపాయాలు కల్పించే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం నుండి అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page