– మీడియాతో ప్రొఫెసర్ కోదండరామ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. దేశ ప్రయాణం ఏ దిశలో సాగాలో నిర్దేశించే ఎన్నికలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాజ్యాంగ నిపుణుడైన సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరమన్నారు. కొందరి ఆధిపత్యం అడ్డుకోవాలంటే ఆయన గెలవాలని కోదండ అన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కోదండరామ్ డియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరరక్షణ దేశ ప్రయోజనాలను జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాపాడతారు. ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు కోదండరామ్ అన్నారు. ఆధిపత్యం, అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తున్న కొందరికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను రక్షించడం కోసం పార్టీలకు అతీతకంగా ముందుకొచ్చి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలన్నారు. న్యాయ కోవిదులు, యూనివర్సిటీల మాజీ వీసీలు, రాజ్యాంగబద్ధ సంస్థల మాజీ ఛైర్మన్‌లు, సీనియర్ జర్నలిస్ట్‌లు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా సంతకాల చేశారని చెప్పారు. అర్బన్ నక్సలైట్ అంశంపై కోదండరామ్ మాట్లాడుతూ.. అర్బన్ నక్సలైట్ అంటే అర్థం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అర్బన్ ఏరియాలో పని చేసినంత మాత్రాన నక్సలైట్ ముద్ర వేయడం ఏంటి?ప్రజాస్వమ్య పరిరక్షణ కోసం పనిచేస్తే ఆ ముద్ర వేసేస్తారా?సామాజిక అభివృద్ధి, వికాసం పట్ల ఈ ముద్ర వేసేవారికి వ్యతిరేకత ఉందని అనుకోవాలి. అణచివేసే ప్రయత్నం చేస్తున్నారంటేనే.. ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉందని అర్థం అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



