– దమ్ముంటే ఆయనను సీఎం చేయాలి
– ఉస్మానియాకు రూ.వేయి కోట్లు ప్రకటించాలి
– బీఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి సొల్లు పురాణం మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. బీఆర్‌ఎస్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోదండరాం పట్ల రేవంత్ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కంటే కోదండరామ్ సీఎం పదవికి అర్హుడని, ఆయనకు సీఎం పదవి అప్పగించాలని సూచించారు. తాను రాజకీయాల్లోకి రియల్ ఎస్టేట్ దందాల కోసం రాలేదని, ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసం పనిచేశానని స్పష్టం చేశారు. ఎరుకుల బిడ్డ కుర్రా సత్యనారాయణకు ఎమ్మెల్సీ ఇస్తే అడ్డుకున్నారన్నారు. తాము కోదండరాంను అడ్డుకోలేదని, తమ గొంతు కోసేందుకే కోదండరామ్‌ను రేవంత్ అడ్డుపెట్టారన్నారు. ఆయనతో రేపు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిలబెట్టాలని సవాల్ విసిరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటే అందరికీ ఆత్మీయత ఎక్కువంటూ ఆయన సావాస దోషాలతో రేవంత్ రెడ్డి లైన్‌లో నడుస్తున్నారన్నారు. అప్పులపై స్పీకర్ అబద్దాలు చెప్పారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన రూ.3 లక్షల 50 వేల 520 కోట్లు అని పార్లమెంటులో రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ కోసం యాదయ్య, శ్రీకాంతాచారి ఆత్మబలిదానాలు చేసుకుంటే రేవంత్ మాత్రం చంద్రబాబు నాయుడు సంకలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కుమార్‌ను ఓయూ వీసీని చేశామని చెప్పడంతో రేవంత్ ఫ్యూడలిజం, భూస్వామ్య మనస్తత్వం బయటపడిరదని దాసోజు విమర్శించారు. కోర్టుల్లో ఉన్న అంశాలపై మాట్లాడి కోర్టులను, తీర్పులను సీఎం అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసేందుకు నిరుద్యోగులు బస్సులు వేసుకుని రాష్ట్రం మొత్తం తిరిగారంటూ 60వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గుర్తించిన ఉద్యోగాలా? సృష్టించిన ఉద్యోగాలా? అని ప్రశ్నించారు. హెచ్‌సీయూలో రేవంత్ రెడ్డి చంపింది ఏనుగులు, సింహాలను కాదు జింకలు, నెమళ్లను అని చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డికి భయం మొదలైందన్నారు. ఉస్మానియా భూములను బీఆర్‌ఎస్ నాయకులు ప్లాట్లు చేసుకుని అమ్ముకుంటారని రేవంత్ రెడ్డి అంటున్నారని, మరి గచ్చిబౌలి భూములను ప్లాట్లు చేసి అమ్ముకున్నది ఎవరో ప్రజలకు చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




