– విజయవంతంగా 250 శస్త్రచికిత్సలు పూర్తి
– కేర్ హాస్పిటల్స్ సాధించిన మరో విజయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ అత్యాధునిక మాకో రోబోటిక్-అసిస్టెడ్ సిస్టమ్ సహాయంతో 250 మోకాలు మరియు హిప్ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సాంకేతికతను ప్రవేశపెట్టిన తక్కువ కాలంలోనే ఈ మైలురాయిని సాధించిన తెలంగాణలో వేగవంతమైన కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఖచ్చితత్వం కూడిన, కేంద్రిత జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలలో కేర్ హాస్పిటల్స్ మరోసారి తన నాయకత్వాన్ని చాటుకుంది. 50 ఏళ్లకు పైబడినవారిలో ఆయుష్షు పెరగడం, కూర్చునే జీవనశైలి, స్థూలకాయం, కదలికలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల మోకాలు, హిప్ ఆర్థ్రైటిస్ సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో విశ్వసనీయమైన మరియు ఆధునిక జాయింట్ మార్పిడి చికిత్సలపై రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. మోకాలి ఆర్థ్రైటిస్ భారాన్ని దృష్టిలో ఉంచుకుంటే, కేర్ హాస్పిటల్స్ సాధించిన ఈ మైలురాయి ప్రజారోగ్య పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా తక్కువ నొప్పి, త్వరితగతిన కోలుకోవడం, దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం రోగులకు లభిస్తోంది. మాకో రోబోటిక్-అసిస్టెడ్ సిస్టమ్ ద్వారా సీటీ స్కాన్ ఆధారంగా ప్రతి రోగికి ప్రత్యేకంగా శస్త్రచికిత్స ప్రణాళిక సిద్ధం చేస్తారు. శస్త్రచికిత్స సమయంలో రియల్ టైమ్ రోబోటిక్ మార్గదర్శకత్వం అందించడంతో ఇంప్లాంట్‌ను అత్యంత ఖచ్చితంగా అమర్చడం సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన ఎముకలు మరియు చుట్టుపక్కల మృదువైన కండరాలను సాధ్యమైనంతవరకు కాపాడేలా ఈ సాంకేతికత సహాయపడుతుంది. సాంప్రదాయ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలతో పోలిస్తే, రోగి త్వరగా నడక ప్రారంభించగలడు. ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గుతాయి. రోజువారీ పనులకు త్వరగా తిరిగి వెళ్లగలడు. క్లినికల్ డైరెక్టర్ సీనియర్ కన్సల్టెంట్ – ఆర్థోపెడిక్స్ డాక్టర్ గొట్టెముక్కల అశోక్ రాజు, మాట్లాడుతూ, “రోబోటిక్ మోకాలు, హిప్ మార్పిడి శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్‌మెంట్ విధానంలో ఒక పెద్ద మార్పు. ప్రతి రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయడం వల్ల వైద్య నైపుణ్యాన్ని సాంకేతిక ఖచ్చితత్వంతో కలిపి స్థిరమైన ఫలితాలు అందించగలుగుతున్నాం. దీని వల్ల రోగులు త్వరగా సాధారణ జీవనానికి చేరుకుంటున్నారు” అన్నారు.
సీనియర్ కన్సల్టెంట్ – ఆర్థోపెడిక్స్ డాక్టర్ శరత్ బాబు, మాట్లాడుతూ, “250 రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేయడం మా అనుభవం, విశ్వాసానికి నిదర్శనం. క్లిష్టమైన కేసుల్లో కూడా రోబోటిక్ సహాయం వల్ల అధిక నియంత్రణ, ఖచ్చితత్వం లభిస్తుంది. రోగులు త్వరగా కోలుకుని తమ రోజువారీ జీవితానికి చేరుకుంటున్నారు” అన్నారు. సీనియర్ కన్సల్టెంట్ – ఆర్థోపెడిక్స్ డాక్టర్ వాసుదేవ జువ్వాడి, మాట్లాడుతూ, “మోకాలు, హిప్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావాలంటే సరైన సర్దుబాటు, సమతుల్యత చాలా కీలకమన్నారు. రోబోటిక్ సిస్టమ్ వల్ల ఇది నిరంతరంగా సాధ్యమవుతోంది. చాలా మంది రోగులు శస్త్రచికిత్స తర్వాత కొద్ది రోజుల్లోనే నిలబడగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే శస్త్రచికిత్స తర్వాత నొప్పి కూడా తక్కువగా ఉంటుంది” అన్నారు.
తక్కువ కాలంలో ఈ మైలురాయి సాధించడం అంటే సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం, అనుభవజ్ఞులైన వైద్య బృందం కలిసికట్టుగా పనిచేయడం వల్లే సాధ్యమైంది. కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను 10,000కు పైగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల అనుభవం కలిగిన ఆర్థోపెడిక్ బృందం నడిపిస్తోందన్నారు. కొల్లూరు కు చెందిన 70 ఏళ్ల విన్జమూరి వి.ఎస్.ఎస్. శర్మ రెండు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్లుగా మోకాలి నొప్పితో నడవడమే కష్టంగా మారింది. మొదట భయపడ్డాను. కానీ రోబోటిక్ శస్త్రచికిత్స తర్వాత త్వరగా నిలబడ్డాను, సహాయంతో నడిచాను. ఊహించిన దానికంటే త్వరగా కోలుకున్నాను. ఇప్పుడు నమ్మకంగా, స్వతంత్రంగా జీవిస్తున్నాను” అన్నారు. సిద్ధిపేటకు చెందిన 65 ఏళ్ల ఎం.ఆర్.జి. రఘునాథం కూడా రెండు మోకాళ్ల మార్పిడి చేయించుకున్నారు. “నడవడం, మెట్లు ఎక్కడం కష్టమైపోయింది. రోబోటిక్ శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం వేగంగా జరిగింది. నొప్పి కూడా తక్కువగా ఉంది. ఇప్పుడు సౌకర్యంగా నడుస్తున్నాను” అన్నారు. బిహెచ్ఈఎల్‌కు చెందిన 57 ఏళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ, “ఇంటి పనులు చేయడమే కష్టమయ్యేది. రోబోటిక్ శస్త్రచికిత్స తర్వాత త్వరగా కోలుకున్నాను. ఇప్పుడు ఎలాంటి నిరంతర నొప్పి లేకుండా రోజువారీ పనులు చేసుకుంటున్నాను” అన్నారు. ఈ విజయంతో కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ రోబోటిక్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలలో ప్రముఖ కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. రోగులు మళ్లీ స్వతంత్రంగా, నొప్పిలేకుండా, నాణ్యమైన జీవితం గడపడానికి ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

———————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.