వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: కిట్స్ డబ్ల్యు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ వడ్డెవరం సిద్ధార్థ పర్వతారోహణ, అనుబంధ క్రీడల రంగంలో జాతీయస్థాయి ప్రశంసలు పొందడం ఒక రికార్డు అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి పేర్కొన్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) చివరి సంవత్సరం చదువుతున్న సిద్ధార్థ పర్వతారోహణ, అనుబంధ క్రీడల జాతీjస్థాయి కార్యకలాపాలలో భాగంగా జాతీయ సాహస శిబిరం-2025ను విజయవంతంగా పూర్తిచేశాడన్నారు. ఇది హిమాచల్‌ప్రదేశ్‌లోని మెక్లియోడ్‌గంజ్ ధర్మశాలలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్వతారోహణ, అనుబంధ క్రీడల ప్రాంతీయ పర్వతారోహణ కేంద్రంలో జరిగిందని తెలిపారు. దీనిని హైదరాబాద్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ డైరెక్టరేట్, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గత నెల 18 నుండి 27వ తేదీ వరకు పది రోజుల ాటు నిర్వహించిందన్నారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థి సిద్ధార్థ నవంబర్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఇందుకు ఎంపికై రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించాడు. రాక్ క్లైంబింగ్, పాపెల్లింగ్, ట్రెక్కింగ్ జంగిల్ క్రాఫ్ట్, మనుగడ, నాయకత్వంలతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించి జాతీయస్థాయి ప్రశంసా పత్రం పొందాడు. సిద్ధార్థను చూసి కిట్స్ వరంగల్ గర్విస్తోందన్నారు. 80 కి.మీ ట్రెక్‌ను విజయవంతంగా పూర్తి చేసి 2,873 అడుగుల ఎత్తుకు ఎక్కాడంటూ అతడి అంకితభావం, అత్యుత్తమ విజయాన్ని అశోక్‌రెడ్డి ప్రశంసించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, డీన్ అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె.వేణుమాధవ్, సిఎస్‌ఈ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ పి.నిరంజన్, కిట్స్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అండ్ ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్.సతీష్‌చంద్ర, అదనపు పీవో ఎస్.భార్గవిలి, డీన్ విద్యార్థి వ్యవహారాలు, ఎన్‌ఎస్‌ఎస్ క్లబ్‌కు చెందిన విద్యార్థి ప్రతినిధులు, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల అధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.ప్రభాకరాచారి, అధ్యాపక సభ్యులు, విద్యార్థులు పాల్గొని సిద్ధార్థను అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



