- లయన్స్ క్లబ్ వరంగల్ మాజీ గవర్నర్ వెంకటరెడ్డి
- ‘కిట్స్’లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం
KITS Warangal Blood Donation Camp 2026 | వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 25: రక్తదానం సామాజిక బాధ్యత అని, కిట్స్ వరంగల్ విద్యార్థులు, సిబ్బంది రక్తదానం చేయడం ద్వారా తమ సామాజిక బాధ్యతను నిరూపించుకున్నారని లయన్స్ క్లబ్ వరంగల్ మాజీ గవర్నర్ లయన్ కె.వెంకటరెడ్డి అన్నారు. ‘కిట్స’ వరంగల్ (KITS Warangal ) ఆడిటోరియంలో సాక్-ఎనఎసఎస్ విద్యార్థుల మెగా రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ వరంగల్ సహకారంతో బుధవారం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘ కిట్స్’ సిబ్బంది, విద్యార్థులు 594 యూనిట్లు రక్తదానం చేయడం గొప్ప విషయమని గౌరవ అతిథి, కేయూ వరంగల్ ఎన్‌ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ కొనియాడారు. కిట్స్ ఎన్ఎస్ఎస్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), కిట్స్ డబ్ల్యు విద్యార్థులు లయన్స్ క్లబ్ వరంగల్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. దివంగత డాక్టర్ వి.విశ్వనాథరావు సతీమణి శ్రీసులోచన జ్ఞాపకార్థం ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, యాజమాన్య సభ్యుడు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక రెడ్డిలు ‘సాక్’ కార్య నిర్వాహక అధ్యాపక, విద్యార్థి బృందాన్ని అభినందించారు.
రక్తదానంతో సంతృప్తి మరే ఇతర దానంతోనూ పోల్చలేనంత గొప్పదని, రక్తదానం ద్వారా విద్యార్థులు యవ్వనంగా కనిపించడమే కాక నైపుణ్యాభివృద్ధిపరంగా చైతన్యం కూడా పెరుగుతుందని వెంకటరెడ్డి చెప్పారు. సురక్షితమైన రక్తం గ్రహీతకు మరింత సురక్షితం అనేది ఒక గొప్ప సామాజిక సేవ అని అన్నారు. ప్రొఫెసర్ నారాయణ రక్తదానం చేయడం, ప్రాణాలను కాపాడటం ప్రాముఖ్యతను వివరించారు. సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ‘కిట్స’ విద్యార్థులు సామాజిక సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రక్తదానం చేయడం మీకు కొన్ని నిమిషాల పని కావచ్చు, కానీ అది వేరొకరికి జీవితకాలంతో సమానం. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో గత రెండేళ్లుగా అత్యధిక యూనిట్ల రక్తాన్ని దానం చేసినందుకు, రాష్ట్ర గవర్నర్ నుండి కిట్స్ ఎనఎసఎస్ యూనిట్ అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకుందని తెలిపారు. ‘కిట్స్’ విద్యార్థులు సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు, ‘కిట్స్’ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అండ్ ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్.సతీష్ చంద్ర, అదనపు పిఓ ఎస్.భార్గవి, డీన్ విద్యార్థి వ్యవహారాలు ప్రొఫెసర్ కె.శ్రీధర్, కిట్స్ డిస్పెన్సరీ బృందం డాక్టర్ సుష్మిత, డాక్టర్ తిరుపతి, మెడికల్ సూపర్‌వైజర్ వి.నీలకంఠం, ఎన్ఎస్ఎస్ క్లబ్ క్లబ్ విద్యార్థి ప్రతినిధులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, ఎనఎసఎస్ క్లబ్ స్టూడెంట్స్, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థి ప్రతినిధులు, వివిధ క్లబ్‌ల జనరల్ సెక్రటరీలు, అధ్యాపక సభ్యులు, 1050కి పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.





