– భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోండి
– కేయూ ఈసీ సభ్యురాలు అనితారెడ్డి
– ‘కిట్స్’లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ
హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కొంతమంది యువత మాదకద్రవ్యాల బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోందని, డ్రగ్స్‌కు నో చెప్పి మీ భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలని సామాజిక కార్యకర్త, వరంగల్ కేయూ ఈసీ సభ్యురాలు డాక్టర్ కె.అనితా రెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. విద్యార్థుల ప్రయోజనం కోసం తల్లిగా నా వ్యక్తిగత సమయం ఖర్చు చేస్తున్నానని తెలిపారు. కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) కిట్స్, వరంగల్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ సహకారంతో విద్యార్థుల కోసం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని కిట్స్ వరంగల్ క్యాంపస్‌లోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. గౌరవ అతిథి, కేర్ అండ్ క్యూర్ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ ఆచార్య రవికుమార్ వేలదండి మాట్లాడుతూ విద్యార్థి జీవితం, యవ్వనం, క్రమశిక్షణ, శారీరక శ్రేయస్సు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మరో గౌరవ అతిథి, కేయూ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ విద్యతోపాటు మీ వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. విద్య సమాజ ప్రయోజనం కోసం మంచి సంస్కృతికి దారి తీస్తుందని సూచించారు. మాదకద్రవ్యాలు తీసుకోకండి .. ఎవరినీ అనుమతించవద్దు అనిే నినాదం చేయించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. మాదకద్రవ్యాలు సృజనాత్మకతను, మంచి దృక్పథాలను నశింపచేస్తాయన్నారు. కంప్యూటర్ టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన పద్ధతులను విద్యార్థి సమాజం అలవాటు చేసుకోవాలని, స్థిరమైన టెక్నాలజీ ద్వారా నిర్మాణాత్మక దేశాన్ని నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో కిట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, కిట్స్‌డబ్ల్యు యాంటీ-డ్రగ్ కమిటీ కన్వీనర్, ప్రొఫెసర్ కె.శ్రీధర్, ఇతర సభ్యులు డాక్టర్ పి.నాగార్జున రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్.సతీష్ చంద్ర, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పిఆర్‌ఓ డాక్టర్ డి.ప్రభాకరాచారి, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



