– ‘టేస్ట్ స్ప్రైట్’ గ్రాండ్ ప్రైజ్ విజేతగా యశ్వంత్ కృష్ణ
– విద్యార్థిని అభినందించిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు
హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : ‘టేస్ట్ స్ప్రైట్’ హ్యాకథాన్ కాంపిటీషన్‌లో ఇండియా నుంచి యశ్వంత్ కృష్ణ విజేతగా నిలిచాడు. కిట్స్ వరంగల్‌కు చెందిన పావుశెట్టి యశ్వంత్ కృష్ణ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ‘టేస్ట్ స్ప్రైట్ఇం’ టర్నేషనల్ హ్యాకథాన్‌లో గ్రాండ్ ప్రైజ్ (1వ బహుమతి) నగదు బహుమతితో 1500 యూఎస్ డాలర్లు (1.4 లక్షల రూపాయలు) గెలుచుకున్నారని రాజ్య సభ మాజీ ఎంపీ, కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు తెలిపారు. భారత్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి కిట్స్ విద్యార్థి కావడం గర్వకారణం అన్నారు, ఇంటర్నేషనల్ హ్యాకథాన్ విజేత యశ్వంత్ కృష్ణ ను మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇదేకాకుండా యశ్వంత్ కృష్ణ పలు విజయాలను సొంతం చేసుకున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జనవరి 2025వ సంవత్సరంలో జరిగిన హైపర్ మోడ్ నాలెడ్జ్ గ్రాఫ్, ఏఐ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్ ప్రపంచవ్యాప్తంగా 533 మంది పాల్గొనగా మొదటి బహుమతిని యశ్వంత్ కృష్ణ, ఈశా ల జోడి విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 25 సంవత్సరంలో ప్రఖ్యాత “ ఐబీఎం ” కంపెనీ హ్యాకథాన్ నిర్వహించగా ప్రపంచవ్యాప్తంగా 1900 మంది పాల్గొనగా ఇండియా నుంచి యశ్వంత్ కృష్ణకు ప్రథమ బహుమతి లభించింది. జూన్ 2025లో ప్రఖ్యాత “ అడోబ్ ” కంపెనీ కి ప్రాజెక్టు సెలెక్ట్ అయ్యారు. 25 నవంబర్ లో “ ఓపస్ కంపెనీ” ఏఐ జెనసిస్ హ్యాకథాన్ నిర్వహించగా వివిధ దేశాల నుంచి 5000 మంది పాల్గొనగా తృతీయ బహుమతి లభించింది. 2026 జనవరి లో “ వెబ్ – 3” వారు హ్యాకథాన్ నిర్వహించగా 2000 మంది పాల్గొనగా యశ్వంత్ కృష్ణకు ప్రథమ బహుమతిగా వరించింది. ఇటీవల మార్చిలో ప్రఖ్యాత అడోబ్ కంపెనీకి మరోసారి రెండవ ప్రాజెక్ట్ కూడా ఎంపిక కావడం విశేషం అన్నారు. ఈ సందర్బంగా చైర్మన్కె ప్టెన్ వి. లక్ష్మీకాంత రావు గారు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్, ఇతర మేనేజ్‌మెంట్ సభ్యులు, ప్రిన్సిపాల్ ప్రొ.కె. అశోక రెడ్డి శుభాకాంక్షలతో యశ్వంత్ ని అభినందించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ యశ్వంత్ కృష్ణ సాధనను గుర్తించి మేము చాలా గర్విస్తున్నామని,కిట్స్ వరంగల్ సంస్థలో భాగంగా వారి విజయాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ కృష్ణను నిర్వాహణ సభ్యులు, వివిధ విభాగాల విభాగాధిపతులు, డీన్ లు, డీన్ అకాడెమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ డా కె వేణు మాధవ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – నెట్‌వర్క్స్ (సి ఎస్ ఎన్) హెడ్ & ప్రొఫెసర్, డాక్టర్ వి శంకర్ , ఐ స్క్వేర్ ఆరఈ హెడ్ & ప్రొఫెసర్ డాక్టర్ కె. రాజ నరేందర్ రెడ్డి, యశ్వంత్ కృష్ణ తల్లిదండ్రులు, డాక్టర్ పావుశెట్టి శ్రీధర్, పి.ఆర్. ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి లు అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





