కిట్స్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులపై రేపు అవగాహన సదస్సు

వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్తు 5: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌ (కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ‘స్టూడెంట్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఓపి)ను బుధవారం నిర్వహించనున్నారు. క్యాంపస్‌లోని ఆడిటోరియం, సిల్వర్‌ జూబ్లీ సెమినార్‌ హాల్‌, న్యూ సెమినార్‌ హాల్‌, సివిల్‌ సెమినార్‌ హాల్‌, మెకానికల్‌ సెమినార్‌ హాల్‌లో ఐదు వేదికలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. కొత్తగా అడ్మిషన్‌ పొందిన బి.టెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో బుధవారం హాజరుకావాలని కోరారు. అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులను, మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలను పరిచయం చేస్తామని తెలిపారు. ‘అలంనాక్‌ ఫర్‌ ఎవై 2025-26’ షెడ్యూల్‌ పేరుతో విద్యా సంవత్సర ప్రణాళిక విడుదల చేస్తామన్నారు. ఈ ఓరియంటేషన్‌ ప్రోగ్రాం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈనెల 7 నుండి స్టూడెంట్‌ ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఐపి) నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో కిట్స్‌ చైర్మన్‌, మాజీ ఎం.పి కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కిట్స్‌ వరంగల్‌ అడిషనల్‌ సెక్రెటరీ వి.సతీష్‌ కుమార్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. కోమల్‌ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌. పి.రమేష్‌ రెడ్డి, విభాగాధిపతులు, వివిధ విభాగాల డీన్స్‌, ప్రొఫెసర్‌ కె.వేణుమాధవ్‌, ప్రొఫెసర్‌ ఎల్‌.సుధీర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ వి.రాజగోపాల్‌ (సిఒఇ), హెడ్‌ ఐ స్క్వేర్‌ ఆర్‌ఈ ప్రొఫెసర్‌ కె.రాజనరేందర్‌ రెడ్డి, ఐక్యూఎసి, కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ యుఎస్‌ బాల్‌రాజ్‌, ఇంటర్న్‌షిప్‌లు, ఎంఒయుల సెల్‌ ఇన్‌ఛార్జ్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ జి.రఘోత్తం రెడ్డి, డీన్‌ ఎస్‌ఎ ప్రొఫెసర్‌ ఎం.శ్రీలత, అసోసియేట్‌ డీన్‌ అండ్‌ ఇఇఇహెడ్‌ ఎం విద్యా వ్యవహారాల కోసం, డాక్టర్‌ పి.ప్రభాకర్‌ రావు, డాక్టర్‌ ఆర్‌.శ్రీకాంత్‌, డాక్టర్‌ ఆర్‌.రమేష్‌ అండ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ పిఆర్‌ఓ, డాక్టరు డి.ప్రభాకరాచారి, టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థి ప్రతినిధులు పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ అశోక్‌ రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *