- దాదాపు 19 దేశాల నుంచి కైట్ ప్లయర్స్ హాజరు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13 కనువిందు చేసే కైట్లు, నోరూరించే స్వీట్లతో.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరు గుతున్న ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలంగాణా మిగతా 2లో..పర్యాటక శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ గ్రాండ్ ఈవెంట్కు దాదాపు 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ హాజరయ్యారు. ఇక దేశంలోని వివిధ నగరాలకు చెందిన దాదాపు 50 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్, జంట నగరాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన యువత సైతం భారీగా ఈ పంతగులు ఎగురవేసే కార్యక్ర మానికి హాజరైంది. చిన్న స్థాయి నుంచి భారీ గాలి పటాలను పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎగురవేశారు. థాయ్లాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, నైజీరియా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, స్విట్జర్లాండ్, మలేషియా తదితర దేశాలకు చెందిన కైట్స్తో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇవి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 60 స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. కైట్ ఫెస్టివల్ మూడు రోజుల పాటు అంటే.. జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు జరగనుంది. ఉదయం 10:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ను హైదరాబాద్ శివార్లలోని మూడు ప్రదేశాలలో నిర్వహి స్తున్నారు. ఉదయం, సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 16 నుంచి 19వ తేదీ వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





