– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12ః కైట్ ఫెస్టివల్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్ రోడ్డు సమీపంలోని ఐమాక్స్ సర్కిల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చక్కటి సందేశాన్ని ప్రజలకు అందించాయి. ముగ్గుల ద్వారా మహిళల ఆలోచనలతో పాటు విషయ పరిజ్ఞానం బయటకు వస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





