అందరినీ సంతోషపెట్టడమే నిజమైన పండగ

– హ‌న్మ‌కొండ ‘స్పంద‌న’లో న్యూ ఇయ‌ర్, సంక్రాంతి వేడుక‌లు

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి కైట్స్ ఫెస్టివల్‌ను మంగ‌ళ‌వారం నిర్వహించారు. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో హన్మకొండ అడ్మిన్ డీసీపీ ఎన్‌.ర‌వి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తరువాత పిల్లలచే కేక్ కట్ చేయించి పతంగులు ఎగురవేయించారు. అనంతరం అనితారెడ్డి, ర‌వి మాట్లాడుతూ కల్మషం ఎరుగని మానసిక దివ్యాంగుల మధ్య నూతన సంవత్సర, సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు, బాలలకు సంతోషాన్ని అందించడం, వారి హక్కులను కాపాడటం అందరి భాధ్యత అని అన్నారు. మానసిక దివ్యాంగుల పిల్లలకు అందరి పిల్లలకు ఉన్న హక్కులు వర్తిస్తాయన్నారు. పిల్లలు పతంగులు చూచి చాలా ఆనందపడ్డారని, పండగ సంబరాలంటే అందరికీ సంతోషాన్ని అందించడమేన‌ని అన్నారు, దివ్యాంగుల సేవ దైవ సేవ అని అన్నారు. మానసిక దివ్యాంగుల పిల్లలకు ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ సమయాన్ని కేటాయించాలని, మానసిక దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని డాక్టర్ అనితా రెడ్డి, డీసీపీ రవి అన్నారు. అనంతరం పిల్లలు డ్యాన్సులు, పాటలతో అలరింప‌జేశారు. అనంతరం పిల్లలకు స్వీట్స్, స్నాక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్.టియుఐఐ శ్యాంసుందర్, సుచరిత‌, రాజేందర్ రెడ్డి, వసుధ, హరిత, భార్గవి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *