కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి శుభాకాంక్షలు

=హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సమస్త హిందూ బంధువులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదిదేవుడైన పరమేశ్వరుడు కరుణాకటాక్షాలు ప్రతి ఇంటా నిండాలని, భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. మహాశివరాత్రి మనకు ఉపవాసం, జాగరణ, ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి సాధించుకునే ఒక పవిత్రమైన సందర్భం.. ఈ పర్వదినం మనలో ధర్మబద్ధత, నిస్వార్థ సేవాభావం, సమాజం పట్ల బాధ్యతను పెంపొందిస్తుంది. ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చైతన్యంతో ముందడుగేస్తూ సనాతన ధర్మ పరిరక్షణలో, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో తమవంతు పాత్రను పోషించాలని కోరుకుంటున్నాను. మనందరి భాగస్వామ్యంతో దేశం అభివృద్ధిలో దూసుకుపోవడంతోపాటు దేశంలో శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలని మహాదేవుడిని నాయన ప్రార్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *