కార్పొరేటర్ వంగా కుటుంబానికి కిషన్ రెడ్డి పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. శనివారం సాయంత్రం ఆయన మృతిచెందిన విషయం విదితమే. వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం విషయం తెలియగానే కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకలాపాల్లో భాగంగా పర్యటనలో ఉన్నందున అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. హైదరాబాద్ చేరుకోగానే నేరుగా వారి ఇం{కి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మధుసూదన్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *