విద్యానగర్‌ లో విషాదం

– ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ పరామర్శ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లోని విద్యాన‌గ‌ర్‌కు చెందిన నజీరుద్దీన్‌ కుటుంబంలోని 18 మంది మృతిచెందారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. నజీరుద్దీన్‌ మృతితో స్థానికులు కన్నీరు పెట్టారు. నసీరుద్దీన్‌  విశ్రాంత‌ రైల్వే ఉద్యోగి. తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. అంతలోనే ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాని కబళించింది. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అతడి నివాసం వద్దకు చేరుకున్నారు. బాధిత కుటుంబ బంధువులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంపర్దించాలని భరోసా ఇచ్చారు టీపీసీసీ అధ్య‌క్షుడు మహేశ కుమార గౌడ్‌ నజీరుద్దీన్‌ ఇంటికి వెళి ఆయన బంధువులతో
మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు మొదలు పెట్టినట్లు చెప్పారు. మరోవైపు నసీరుద్దీన్ ఇంటి వద్ద రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని నమ్మలేకపోతున్నా మంటూ ఆయన బంధువులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 18 మంది అంత్యక్రియలను సౌదీలోనే నిర్వహించనున్నట్లు నసీరుద్దీన్ బంధువులు పేర్కొన్నారు. మరోవైపు ఇదే ప్రమాదంలో.. హైదరాబాద్ పాతబస్తీ బహ దూర్పురాకు చెందిన ఐదుగురు మృతి చెం దారు. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మె ల్యే మహ్మద్ ముబీన్ పరామర్శించారు. సౌదీలో సోమవారం తెల్లవారుజామున జరిగి న రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీళ్లంతా హైదరాబాద్ వాసులేనని తెలంగాణ హజ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈనెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు బయల్దేరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page