కిషన్‌ ‌రెడ్డి చేసిందేమిటో చర్చకు సిద్దం

‌న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 26:  ‌బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ముద్దాయిగా నిరూపించబడ్డారని శిక్ష తప్పదని టిపిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. ఫార్ములా ఈ కార్‌ ‌రేసులో కెటిఆర్‌ ‌తప్పు చేశారని అన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆయన డియాతో మాట్లాడుతూ..మూసి సుందరీకరణను బిఆర్‌ఎస్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు అని సూచించారు. తెలంగాణకు కిషన్‌ ‌రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం అని సవాల్‌ ‌విసిరారు. కేంద్రం దగ్గర బిసి బిల్లు ఎందుకు పెండింగ్‌ ‌లో ఉందో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రమంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌ప్రయత్నిస్తే బిసి బిల్లు ఆమోదం పొందుతుందని మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *