– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నాడు కెేసీఆర్ పాలన ఎలా ఉందో నేడు రేవంత్ రెడ్డి పాలన కూడా అలాగే కొనసాగుతున్నది అని కేంద్ర మంత్రి కిషననరెడ్డి విమర్శించారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్ హాలులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌తోటే మార్పు సాధ్యమని చెప్పి మోసపూరిత హామీలతో గద్దెనెక్కి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మరింత అప్పులకుప్పగా మార్చిందని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ప్రజా క్షేత్రంలో నిలదీయాలని ప్రజలకు కిషననరెడ్డి పిలుపునిచ్చారు. తులం బంగారం, ప్రతి విద్యార్ధికి స్కూటీ హామీలు ఎక్కడిపోయాయని ప్రశ్నించాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4000 హామీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న హామీ ఊసే లేదన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని వారిని మోసం చేసిందన్నారు. బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు లేదన్నారు. ఈ రెండేళ్లలో బీసీల అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలని నిలదీశారు. పొదుపు సంఘాలకు కేంద్రం రూ.20 లక్షల రుణం ఇస్తుండగా తెలంగాణ ప్రభుత్వం పొదుపు సంఘాలకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని కిషననరెడ్డి విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





