హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అన్ని రకాల విఘ్నాలను తొలగించి సరైన మార్గంలో మనల్ని నడిపించే విఘ్నేశ్వరుడు ఓర్పునకు, విద్యకు, శ్రద్ధాసక్తులకు, ప్రకృతికి, పర్యావరణ పరిరక్షణకు, విజయానికి ప్రతీక అని అన్నారు. భక్తిశ్రద్ధలతో పూజించి వినాయకుడి ఆశీస్సులతో మనందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు రావాలని, ఆటంకాలన్నీ తొలగిపోయి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




