కామంతో యువతిపై టీనేజర్‌ ‌దాడి

– తిరస్కరించడంతో చంపేసి ఇంటికి నిప్పు
– బెంగళూరులో దారుణ ఘటన

బెంగళూరు, జనవరి 13: బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డ ఇంటర్‌ ‌విద్యార్థి.. ఆమె తిరస్కరించడంతో కత్తితో పొడిచి చంపాడు. అంతేగాక ఇంటిని తగులబెట్టాడు. అంతా అగ్నిప్రమాదమని భావించినా పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. చిరుప్రాయంలోనే ఆ యువకుడి ఆలోచనలు అదుపు తప్పాయి. పక్కింటి యువతి ఒంటరిగా ఉన్నవేళ కామంతో అఘాయిత్యానికి తెగించాడు. ప్రతిఘటించడంతో హత్య చేసి ఆధారాలు చెరిపేసేందుకు ఇంటికే మంటపెట్టాడు. ఆమె అగ్ని ప్రమాదంలో మరణించినట్లు తొలుత భావించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలతో యువకుడి పాత్ర బయటపడింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ యువ‌తి (34) బెంగళూరులోని సాప్ట్‌వేర్‌ ‌ఇంజినీర్‌గా పనిచేస్తున్న‌ది. రామ్మూర్తినగర ఠాణా పరిధి సుబ్రహ్మణ్య లేఅవుట్‌లోని ఓ ఫ్లాట్‌లో తన స్నేహితుడితో కలిసి ఉంటోంది. ఈనెల 3న ఆమె ఒంటరిగా ఉన్నవేళ ఫ్లాట్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగగా ఆమె మరణించినట్లు ఫిర్యాదు అందింది. పోలీసులూ ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది సాధారణ మరణం కాదని ఫోరెన్సిక్‌ ‌నివేదికలో తేలింది. ఆమె శరీరానికి నిప్పు అంటుకోకముందే చేతిపై గాయాలయ్యాయని, ఆపై ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో పోలీసులు అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్‌లు సేకరించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె ఉండే ప్లాట్‌ ‌పక్కనే కొడగు జిల్లా విరాజ్‌పేటెకు చెందిన ఇంటర్‌ ‌సెకండియర్‌ ‌విద్యార్థి (18) తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 3న మృతురాలి స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో ఆమె గదిలోకి కిటికీలోంచి దూరాడు. లైంగిక కోర్కె తీర్చాలని ఒత్తిడి తేవడంతో గట్టిగా అరుస్తూ తోసివేసింది. కోపం పట్టలేని ఆ యువకుడు వంట గదిలోని కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె పరుపుపై పడిపోగా మరోసారి కొట్టాడు. నోటిని దిండుతో గట్టిగా మూయడంతో ఊపిరాడక చనిపోయింది. ఆపై సాక్ష్యాలను నాశనం చేసేందుకు రక్తపు మరకలున్న ఆమె దుస్తుల్ని తీసి అదే గదిలో నిప్పంటించి కాల్చేశాడు. మంటలు వ్యాపించడంతో కిటికీలోంచి దూకేశాడు. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఆమె మరణించిందని, సహజ మరణంగా చూపేందుకు ఇలా చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. మృతురాలి సెల్‌ఫోన్‌లోని వివరాలు ఈ కేసు దర్యాప్తునకు ఉపకరించాయి. మృతురాలి స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *