ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌ను కేటాయించాలి

– క్రీడల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
– రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియాతో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం దిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ నేడు దిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమై ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇదివరకే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాండవియాను కలిసి విజ్ఞప్తి చేశారని, తాజాగా క్రీడల శాఖ మంత్రిగా తాను కేంద్ర మంత్రిని కలిసి వచ్చే సంవత్సరం ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించడానికి తెలంగాణ అన్ని విధాలుగా అనువైన ప్రదేశం అని మరోసారి వివరించానని చెప్పారు. హకీంపేట, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వనపర్తి సహా ఇలా వివిధ జిల్లాల్లో ఉన్న క్రీడా పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి క్రీడలకు అమిత ప్రాముఖ్యతను ఇస్తూ రాష్ట్ర క్రీడా పాలసీని స్వయంగా పర్యవేక్షించి తయారు చేయించారని, స్టేడియాలు నిర్మించాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారని, అందుకనుగుణంగా తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీని రూపొందించినట్టు కేంద్ర మంత్రికి వివరించానని తెలిపారు. తమ విజ్ఞప్తులకు మన్‌సుఖ్‌ సానుకూలంగా స్పందించారని, మూడు రోజుల షెడ్యూల్‌తో తెలంగాణకు వస్తామని చెప్పారని మంత్రి వాకిటి వివరించారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అధారిట ీచైర్మన్‌ శివసేనా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడా రంగానికి సంబంధించిన వివిధ పెండిరగ్‌ పనులపై కేంద్ర మంత్రితో చర్చించామన్నారు. వనపర్తిలోని హాకీ అకాడమీలో మౌలిక సదుపాయాల కల్పన, స్పోర్ట్‌ స్కూల్స్‌లో టర్ఫ్‌ ఏర్పాటు, నల్గొండ, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల వంటి ప్రాంతాల్లోని స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో ఎక్విప్‌మెంట్‌ కోసం ఫండ్స్‌ కావాలని కోరామన్నారు. రాష్ట్రం తెలంగాణలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి కూడా సహకరించాలని కోరామని చెప్పారు. సమావేశంలో దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడల సలహాదారు ఎ.పి.జితేందర్‌ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల, ప్రాయోజిత పధకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *