క్రీడలపై ఆసక్తి పెరిగేందుకే ‘ఖేలో భారత్’

– పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో రామచందర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: యువతకు క్రీడలపై ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలో భారత్ అనే కార్యక్రమం ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ అన్ని క్రీడలను ప్రోత్సహించారని, భారతీయ క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేశారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నిర్వహించారు. జనవరి 23న ప్రారంభమైన ఈ క్రీడోత్సవాలు నెల రోజులపాటు జరగగా ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి వివిధ క్రీడల్లో వేలాదిమంది యువత, మహిళలు, వివిధ రంగాలకు చెందిన క్రీడాకారులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాతోపాటు స్థానిక జర్నలిస్టులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడామహోత్సవం ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జింఖానా గ్రౌండ్ వేదికగా శనివారం జరిగింది. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ గెలిచినా, ఓడినా క్రీడాకారులను పిలిపించి మోదీ మాట్లాడుతున్నారు.. వారిని మరింత ప్రోత్సహిస్తున్నారన్నారు. క్రికెట్, ఒలంపిక్స్, పారా ఒలంపిక్స్, బ్యాడ్మింటన్ ఇలా అన్ని రకాల క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని పిలిపించి మాట్లాడుతున్నారని, అంతేకాÅ£ దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నారని, బిజెపి ఎంపీలు లేనిచోట రాజ్యసభ సభ్యుల ద్వారా క్రీడా పోటీలు నిర్వహణను ప్రోత్సహిస్తున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఈ క్రీడా పోటీలకు మంచి స్పందన వస్తోందన్నారు. గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ క్రీడా పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, జర్నలిస్టులు కూడా క్రీడల్లో పాల్గొని తమ ఆసక్తి కనబరిచారని చెప్పారు. తార్నాక జర్నలిస్ట్ టీం తండర్ తార్నాక పేరుతో కప్పును గెలుచుకుందన్నారు. పిల్లల నుంచి గృహిణుల వరకు అందరూ పాల్గొనేలా అవకాశం కల్పించారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యేటా ఇలానే క్రీడా పోటీలు భారీ ఎత్తున నిర్వహించాలని కోరుకుంటున్నామన్నారు.

మోదీ కార్యక్రమాలు ఆచరణ యోగ్యమైనవి :విద్యాసాగర్‌రావు

కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఈ కార్యక్రమం లక్షలాదిమంది భారతీయ ప్రజలు ముఖ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాల్గొని యువత తమ శక్తిని ప్రదర్శించారన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకున్న స్వచ్ఛ భారత్ నుంచి క్రీడా కార్యక్రమాల వరకు ప్రతి ఒక్కటీ ఆచరణ యోగ్యమైనవని కొనియాడారు. చెస్ వంటి పలు క్రీడల్లో భారత్ ముందంజలో ఉందన్నారు. ఆనాడు నిజాం సంస్థానం నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేయడానికి కూడా ఆపరేషన్ పోలో అని ఒక క్రీడ పేరు పెట్టారని గుర్తుచేశారు. అప్పట్లో పోలో గ్రౌండ్స్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమన్నారు. ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని క్రీడాకారులకు సూచించారు. ప్రతిరోజు గ్రామాల నుంచి పట్టణాలు వరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటూ ఇలాంటి కార్యక్రమాల వల్ల నిగ్రహ శక్తి పెరుగుతుందని, దురఅలవాట్ల నుంచి దూరంగా ఉండాలంటే ఇలాంటి క్రీడలు ఎంతో అవసరమని ఆయన చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *