– భారత్ దాడులు చేస్తే బుద్ది చెబుతామని హెచ్చరిక
ఇస్లామాబాద్, ఏప్రిల్ 3 :పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. పహల్గాం దాడి జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే వారు తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. మరోసారి తమతో ఘర్షణకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమపై జరిగే దాడులను వేగవంతమైన, ప్రణాళికాబద్ధమైన ప్రతిస్పందనతో తిప్పికొడతామన్నారు. ఇరాన్ యుద్దాన్ని అవకాశంగా తీసుకొని పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పాక్‌ను హెచ్చరించారు. ఉరి సెక్టార్ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్రెí్టక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సిందూర్‌లను గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





