– తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై..
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్ ఆవిష్కరించిందని పేర్కొన్నారు. దిల్లీలో మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో ముఖ్యమంత్రి గురువారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై వారి మధ్య చర్చ జరిగింది. సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై అగ్ర నేతలు సీఎంను ప్రశంసించారు. సీఎం వెంట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





