– మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు
గాంధీనగర్,సెప్టెంబర్ 10: భారత రాజ్యాంగాన్ని గానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం మోదీ, అమిత్‌షాలకు లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖర్గే గుజరాత్‌లోని జునాగఢ్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాల ప్రధాన లఁ్‌యం ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడడటమే. ప్రజాస్వామ్యంలో పోరాడటం సర్వసాధారణమే. కానీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే మా లక్ష్యం. మహాత్మాగాంధీ, సర్దార్‌వల్లభారుపటేల్ వంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఇది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన ఈ ఇద్దరు మనకు అత్యంత గౌరవనీయులు. వారివల్లే దేశం ఐక్యం ఉంది. కానీ మరో ఇద్దరు వ్యక్తులు మోడీ, అమిత్‌షా మాత్రం రాజ్యాంగం సురక్షితంగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కానీ కోరుకోవడం లేదు’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నిలపై ఆయన స్పందించారు. ‘మాకు మెజారిటీ- లేదు. అయినప్పటికీ మాకు ఉన్నన్ని వోట్లు- వొచ్చాయి’ అని ఖర్గే అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ జరిగిందని, దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.