ఉత్కంఠగా ఖమ్మం మునిసిపల్ పోరు

– చైర్మన్ కోసం లాబీయింగ్
– ముగ్గురు మంత్రులకు పరీక్ష
– కొత్తగూడెం కార్పొరేషన్ ఉత్కంఠ
– కాంగ్రెస్, సిపిఐ సమాన స్థానాలు
– ఇతరులు కలిస్తే మేయర్ సీటు ఖాయం

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. మున్సిపాల్టీ/కార్పొరేషన్ వారీగా స్థానికంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓట్లు లెక్కించారు. ఆయా జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి (ఖమ్మం), కలెక్టర్ జితేష్ వి. పాటిల్ (భద్రాద్రి కొత్తగూడెం) పర్యవేక్షిశీచారు. ఖమ్మం జిల్లాలో పోలీస్ కకమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శాంతి భద్రతలు సమీక్షించారు. ఖమ్మం జిల్లా లోని అయిదు మున్సిపాల్టీలు, భద్రాద్రి జిల్లాలో ని రెండు కాంగ్రెస్ విజయం సాధించాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు సమన్వయంతో చైర్మెన్ లను ఎంపిక చేయనున్నారు. ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్, దాని మిత్రపక్ష సీపీఐ పార్టీలకు సందిగ్ధ స్థితిలోకి నెట్టాయి. ఏ పార్టీకీ పూర్తి స్థాయి ఆధిక్యతను ఇవ్వకుండా, కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు సమాన సంఖ్యలో కొత్తగూడెం ఓటర్లు తీర్పునివ్వడం విశేషం. కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇండిపెండెంట్లు 6, సీపీఎం, బీజేపీ అభ్యర్థులు ఒక్కో డివిజన్ చొప్పున గెలుపొందారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకపక్షంగా ఏ పార్టీకి దక్కే పరిస్థితులు ఏర్పడలేదు. అధికార పార్టీతో సీపీఐ రాష్ట్ర స్థాయిలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు లేదు. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని మధ్య వైరం పొత్తు పొడవలేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కొత్తగూడెం వచ్చి కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. ఇప్పుడు ఆ రెండు పార్టీ లకు మేయర్ స్థానం పొందాలంటే ఇతరుల సహకారం అవసరం. సీపీఐకి బి.ఆర్.ఎస్. నేత కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇక్కడ ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మేయర్ ఎన్నిక వరకు ఇక్కడి కార్పొరేషన్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ లో 32 వార్డులు ఉండగా ఒక వార్డు కాంగ్రెస్ కు ఎకగ్రీవం అయింది. 31 వార్డుల్లో ఎన్నిక కాంగ్రెస్-23, బిఆర్ఎస్. -02, సిపిఐ-03, సీపీఎం-02,ఇండిపెండెంట్-01 గెలుపొం దారు. చైర్మెన్ ఎస్సీ మహిళా కు రిజర్వు అయి ంది. కాంగ్రెస్ గెలుపొందింది. మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఉండడంతో ఆయన నిర్ణయం మేరకు చైర్ పర్సన్ కానున్నారు. తొలిసారి ఇక్కడ మున్సిపాల్టీ ఏర్పడింది. వైరా మున్సిపాలిటీ లో 20 వార్డులు ఉండగా సీపీఎం-01, ఇండిపెండెంట్-01. కాంగ్రెస్ విజయం సాధించింది. చైర్మెన్ స్థానం జనరల్ మహిళా కు రిజర్వు అయింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిర్ణయం మేరకు పార్టీ కౌన్సిలర్లు ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు కాంగ్రెస్-12, బి.ఆర్.ఎస్.-05, సిపిఐ-01, తెలిపాయి. మధిర మున్సిపాలిటీ లో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్-18,బి.ఆర్.ఎస్.-01, ఇండిపెండెంట్-03. కాంగ్రెస్ గెలిచింది. ఛైర్మెన్ స్థానం జనరల్ మహిళా కు రిజర్వు అయింది. డిప్యూటీ సీఎం భట్టి కీలక అనుచరుడు పార్టీ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి భార్య లక్ష్మి తులసి (6వ డివిజన్) చైర్ పర్సన్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలో చర్చ సాగుతోంది. శ్రీనివాసరెడ్డి కి ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం సామాజిక సమీకరణాల్లో జస్ట్ మిస్ అయింది. దీంతో ఆయన మిస్సెస్ కు చైర్మెన్ గిరి ఖాయమనే వాదన బలంగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. కల్లూరు మున్సిపాలిటీ లో 20 వార్డులు ఉండగా కాంగ్రెస్-12, బి.ఆర్.ఎస్.-07, ఇండిపెండెంట్-01. కాంగ్రెస్ విజయం. సాధించింది. ఛైర్మెన్ స్థానం ఎస్టీ జనరల్ కు రిజర్వు అయింది. చైర్ పర్సన్ రేసులో కౌన్సిలర్లు బానోత్ మారొని(6వ వార్డు), భూక్యా రాంబాయి (4వ వార్డు) ఉన్నారు. మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే రాగమయి చైర్ పర్సన్ ను ఎంపిక చేయనున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ లో 23 వార్డులు ఉండగా కాంగ్రెస్-17, బి.ఆర్.ఎస్.-6, కాంగ్రెస్ గెలిచింది. చైర్మెన్ జనరల్ మహిళా కు రిజర్వు అయింది. తోట సుజల రాణి (6 వార్డు), మట్ట దేవ జ్యోతి (10 వార్డు), రెహానా బేగం (22 వార్డు) తదితరులు చైర్మెన్ రేసులో ఉన్నారు. మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే రాగమయి చైర్ పర్సన్ ను ఎంపిక చేయనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 వార్డులు ఉండగా కాంగ్రెస్-22, బి.ఆర్.ఎస్.-8, సిపిఐ-22, సీపీఎం-1, బీజేపీ-1, ఇండిపెండెంట్-6. ఛైర్మెన్ ఎస్టీ జనరల్ కు రిజర్వు అయింది. అశ్వారావుపేట మున్సిపాలిటీ లో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్-17, బి.ఆర్.ఎస్.-02, బీజేపీ-01, ఇండిపెండెంట్-02 చైర్మెన్ జనరల్ మహిళా కు రిజర్వు అయింది. మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చైర్ పర్సన్ ను ఎంపిక చేయనున్నారు.
ఇల్లందు మున్సిపాలిటీ లో 24 వార్డులు ఉండగా కాంగ్రెస్-19, బి.ఆర్.ఎస్.-3, ఇండిపెండెంట్-2. చైర్మన్ బీసీ మహిళకు రిజర్వు అయింది. మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే కనకయ్య చైర్ పర్సన్ ను ఎంపిక చేయనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *