ప్రణాళికబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధి:

  • మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రోడ్ల విస్తరణకు మార్కింగ్ చేయాలి
  • ఖాళీ స్థలాల పరిశుభ్రత బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి
  • ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం అభివృద్ధి చేసేందుకు చర్యలు
  • వ్య‌వ‌సాయ‌ శాఖ మంత్రి తుమ్మల 

ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సోమవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 12వ డివిజన్ లో మంత్రి పర్యటించి మునిసిపల్ నిధులు రూ.49.80 లక్షలతో పెట్ పార్క్ ను, రూ.89 లక్షలతో సీసీ రోడ్డు విస్తరణ, కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామ‌న్నారు. పేదలకు ప్రణాళిక ప్రకారం ఇంటి స్థలాలు కేటాయించి కాలనీలు కట్టాలని అంతే తప్ప ఎక్కడంటే అక్కడ భూ ఆక్రమణలు చేయకుండా మొదటి దశలోనే నిరోధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.రోడ్లపై ప్రార్థన మందిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, దేవుడు ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని చూడరని అన్నారు. ప్రజలు ఒప్పుకోవడంతో చెరువు బజార్, రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ చేస్తున్నామని అన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రోడ్ల విస్తరణ మార్కింగ్ చేయాలని, ప్రజలు ఒప్పుకుంటే వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు.రాబోయే కొద్ది రోజులలో ఖమ్మం నగరం ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని, గతంలో వేసిన బైపాస్ రోడ్డు నేడు సరిపోవడం లేదని, ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ఖమ్మం నగరంలో మంచి శాంతి భద్రతలు ఉన్నాయని  అన్నారు.మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ మాట్లాడుతూ  250 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 39 కోట్లతో ఖమ్మం ఖిల్లాకు రోప్ వే నిర్మాణం, వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, 155 కోట్లతో మార్కెట్ యార్డ్ నిర్మాణం, విలీన గ్రామాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అంతర్గత రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు., రోడ్లను ఆక్రమిస్తూ ర్యాంప్ నిర్మాణం చేయవద్దని అన్నారు.మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ,* కోటి 40 లక్షలతో 12వ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. హైదరాబాద్ నుండి ప్రేరణ తీసుకొని పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక పార్కు ఖమ్మం నగరంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో మంత్రి సూచనల ప్రకారం అంతర్గత రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు, ప్రధాన రోడ్ల విస్తరణ జరుగుతున్నాయని అన్నారు. ప్రతి డివిజన్ పరిధిలో పారిశుధ్యం, గ్రీనరీ పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, దీనికి ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అందాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కోరారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ నాగేశ్వర రావు, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *