– భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ పక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈమేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ పరిధిలో అధికారులు భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు. హైదరాబాద్ గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో భూముల సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 50 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు పక్రియ ప్రారంభమైంది. భూ యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా యజమానులు తమ హక్కుల పత్రాలు పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు నిర్దేశిత సమయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏమైనా అభ్యంతరాలంటే నిర్ణీత సమయంలో తెలియజేయాలని అధికారులు సూచించారు. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను కూడా ప్రకటించారు. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కి.విÖ పరిధిలో 14 మండలాలు, 46 గ్రామాల్లో మూసీ అభివృద్ధి జరగనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




