తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు. ?….

తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు. ?…

కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సునీత, మరో కీలక నేత చెన్నూరి హరీష్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్లు సమాచారం. .అందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత ఒకరు. ఆమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్యగా గుర్తించినట్లు సమాచారం. సునీత అరెస్టు మావోయిస్టు నేతృత్వానికి పెద్ద దెబ్బగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా మరో మావోయిస్టు నాయకుడు చెన్నూరి హరీష్ కూడా స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు తెలుస్తోంది.. ఈ విషయం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.ఆయన లొంగిపోవడమే కాకుండా, ఇప్పటి వరకు మావోయిస్టుల కార్యకలాపాలపై తనకు తెలిసిన విషయాలను అధికారులకు వెల్లడిస్తున్నట్లు సమాచారం.ఇక ఈ తాజా పరిణామాలు మావోయిస్టుల భవిష్యత్ వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు బలగాలను సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో, అగ్రనేతల అరెస్టులు, లొంగిపోవడం వారిలో ఆందోళనను పెంచుతున్నట్లు సమాచారం. రాష్ట్ర పోలీసులు ఇప్పటికే మావోయిస్టు ఏరివేతకు మరింత వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో సునీత అరెస్టు, హరీష్ లొంగిపోవడం మావోయిస్టు పార్టీ ఎదురుదెబ్బ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *