కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీసులు

– రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ

తిరువనంతపురం, డిసెంబర్‌ 1: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన పర్సనల్‌ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్‌ ఐజాక్‌కు సోమవారం షోకాజ్‌ నోటీసులు పంపింది. 2019లో మసాలా బాండ్‌ జారీలో రూ.466 కోట్ల లావాదేవీలకు సంబంధించి విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లను సేకరించే ప్రణాళికలో భాగంగా విజయన్‌ ప్రభుత్వం ఈ బాండ్లను తీసుకొచ్చింది. అయితే ఈ నిధులను అక్రమంగా మళ్లించారని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని ఈడీ ఆరోపిస్తోంది. దానిలో భాగంగా ఈ జనవరిలో థామస్‌కు సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులు రూ.466 కోట్ల లావాదేవీలకు సంబంధించినవని అధికారులు వెల్లడించారు. ఈ నోటీసుల కింద సీఎం వ్యక్తిగతంగా దర్యాప్తు సంస్థ ముందు హాజరుకానవసరం లేదు. ఈ తరహా బాండ్లను జారీ చేసిన తొలి రాష్ట్రం కేరళనే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *