ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం

– పాలమూరు రంగారెడ్డి పథకం లక్ష్యంగా కార్యాచరణ
– మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో సభలు
–  అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ వ్యూహం పై సమాలోచన
– నాయకులకు దిశా నిర్దేశం 

సిద్దిపేట, ప్రజాతంత్ర డిసెంబర్ 26: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో శుక్రవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్ ,నల్గొండ, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్న తీరుపై ప్రజలకు వివరించాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి  కేసీఆర్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ఈనెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి సవివరంగా వివరించనన్నట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందు కు తీసుకురాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీ ఆర్ ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేసుకున్న పాలమూరు ప్రాజెక్టు ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా పూర్తి చేయడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు సామర్థ్యం 90.18 టీ.ఎం.సీ లుగా నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సగానికి సగం తగ్గించి 45 టీఎంసీలను మాత్రమే తెలంగాణకు సరిపోతాయని కేంద్ర ప్రభుత్వానికి లేఖను ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా జలాలను దోచి పెట్టేందుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారనీ సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇదే విషయమై మహబూబ్ నగర్ ,నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలోని గ్రామాల వారీగా నిరాహార దీక్షలు ,నిరసన దీక్షలు చేపట్టాలని, మండలాలు, డివిజన్ కేంద్రాల్లో నిరసనలు ఆందోళనలు నిర్వహించాలని ఇందు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ వేశారని సమాచారం. పాలమూరు ప్రాజెక్టుపై ప్రత్యేక పాటలను సిద్ధం చేయాలని, సోషల్ మీడియాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలని తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలనేది బిఆర్ఎస్ లక్ష్యం. జనవరి 2వ తేదీ నుంచి మూడు జిల్లాలలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం. కేసీఆర్ తో జరిగిన ఈ ప్రత్యేక భేటీలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయా జిల్లాల బిఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *