– సిద్దిపేట నియోజకవర్గంలో పామాయిల్ ఉత్పత్తి
– కాంగ్రెస్ పాలనలో 12గంటలే కరెంటు సరఫరా
– రెండు పంటలకు రేవంత్ రైతుబంధు ఎగ్గొట్టాడు
– రెండేళ్లలో ఒక్క గజం కూడా కాళేశ్వరం కాల్వ తవ్వలేదు
– వానాకాలం పంట రూ.600 కోట్లు పెండింగ్ పెట్టిండు
– కాళేశ్వరం వల్లనే సిద్దిపేట నియోజకవర్గంలో పెరిగిన సాగు
– మాజీ మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 9: సిద్దిపేట నియోజక వర్గంలో పూర్తి స్థాయిలో నూనె ఉత్పత్తి ప్రారంభమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన నంగునూర్ మండలం నర్మేట ఆయిల్ పామ్ ప్యాక్టరీ నీ సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కలలు నేడు నిజమైన సందర్బంగా చాలా ఆనందంగా ఉందన్నారు. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. రైతులకు నీళ్ల బాధ లేకుండా కేసీఆర్ చేసిండు. కేసీఆర్ బిస్కెట్స్ తరహాలో ట్రాన్స్ ఫార్మర్‌లను పంచిపెట్టాడు. ఎరువుల కొరత లేదు. వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారు. రెండేళ్ల కాంగ్రెస్ అలనలో వ్యవస్త అస్తవ్యస్తమైంది. కాంగ్రెస్ పాలనలో కరెంట్ 12గంటలకు మించి రావడం లేదు. యూరియా కోసం యాప్ లు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నదన్నారు. కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటూ బిచ్చగాళ్ల గా మారుస్తున్నద న్నారు. రేవంత్ రెడ్డి రెండు పంటలకు రైతు బంద్ ఎగొట్టాడు. వానకాలం పంట 600కోట్ల బోనస్ పెండింగ్ పెట్టింది. రెండేళ్ల లో ఒక్క గజం కాళేశ్వరం కాలువ తవ్వలేదు, 5కోట్లు ఖర్చు చేస్తే కాలువల ద్వారా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. రేవంత్ రెడ్డి రైతులపై కక్షగట్టి పనిచేస్తున్నాడన్నారు. రెండేళ్లలో పంటల బీమా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హస్తం గుర్తు కాస్త మొండి హస్తం అయిందని ఎద్దేవా చేశారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయిల్ పామ్ మేమే చేసినము అని మొండి వాదన చేస్తున్నారు. 2021మార్చి 25న ఆయిల్ పామ్ ప్యాక్టరీ పెట్టడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది జూన్ 5న అశ్వారావుపేట నుండి ఆయిల్ పామ్ మొక్కను తెచ్చి ఇక్కడ నాటాం. నేడు జిల్లాలో 14075ఎకరాలకు ఆయిల్ పామ్ తోటలు విస్తరించాయన్నారు. 2022 ఏ్రపిల్ 13న రూ.300 కోట్లతో ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం. ఇప్పటివరకు 3500 గేలలను క్రషింగ్ చేస్తున్నామన్నారు.
సిద్దిపేటకు గోదావరి జలాలు 40 ఏండ్ల కల. సిద్దిపేట జిల్లాలో 8వేల ఎకరాల నుండి 80వేల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పెరిగిందని గుర్తుచేశారు. త్వరలోనే రిఫైనరీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 600మెట్రిక్ టన్నుల ఆయిల్ వస్తున్నది. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదని విమర్వించారు. నియోజకవర్గంలో 22వేల మందికి రుణ మాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ ప్రారంభించడానికి వస్తే బాగుండు.. నియోజకవర్గంలో 22 వెల మంది రైతులకు రుణ మాఫీ కావాలని అన్నారు. రుణమాఫీ అయ్యే దాకా ఇక్కడే కూర్చుంటానన్నారు. వేలమంది పోలీసులను పెట్టుకొని అశోక్ నగర్ లో రేవంత్ రెడ్డి సినిమా టాకీస్ ప్రారంభానికి పోతున్నాడన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీకి పోయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిన్న దిల్సుఖ్ నగర్ విద్యార్థులు రోడ్ పైకి వచ్చి ధర్నా చేశారు. అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఇచ్చిన హామీ గురించి చెప్పమన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోవాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





