– మాజీ సీఎం కేసీఆర్ ఘన నివాళి
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 11: వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన సామాజిక విప్లవకారుడు, సమసమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని బీఆరఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఫూలే జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో వర్ణ, కుల లింగ వివక్షను రూపుమాపి సామాజిక న్యాయం దక్కాలని పోరాడిన దార్శనికుడు ఫూలే అని పేర్కొన్నారు. సబ్బండ వర్ణాలు సామాజిక ఆర్థిక రంగాల్లో ముందడుగు వేయాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పిన జ్యోతిరావు ఫూలే ఆశయాలు ఎల్లకాలం ఆచరణీయమైనవని అన్నారు. తన భార్య సావిత్రి బాయి ఫూలేకు చదువు నేర్పించి మరీ, చదువు నిరాకరించబడిన భారత మహిళకు విద్య నేర్పాలనే దŠృఢ సంకల్పాన్ని అనేక కష్టనష్టాల నడుమ అమలు చేసిన మహిళాభ్యుదయ మార్గదర్శి అయ్యారని అని తెలిపారు. ఫూలే ఆశయాలను నిజం చేస్తూ తన పదేండ్ల ప్రగతి పాలనలో సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అమలు చేసి ఫలితాలను సాధించిన పలు రకాల పథకాలను కార్యాచరణను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. బీసీ కులాల విద్య కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి వారికి అంతర్జాతీయ స్థాయి విద్యనందించినామని తెలిపారు. బీసీ కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఫూలే ఆశయాలకు అనుగుణంగా తాము గత ప్రభుత్వంలో అమలులోకి తెచ్చిన ప్రగతి కార్యాచరణను చిత్తశుద్దితో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తద్వారా మాత్రమే మహాత్మాఫూలేకు మనం ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్ఠం చేశారు.
పూలే ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు : బండి సంజయ్
అణచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్.. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం మహాత్మా జ్యోతి రావు పూలే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. విద్య పరంగా, ఆర్థికంగా సమాజం అభివృద్ధి కోసం చివరిదాకా కృషి చేసిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అభిమానించే జ్యోతిరావు ఫూలే కుల వివక్షపై అలుపెరగని పోరాటం చేశారని కీర్తించారు. ఆ రోజుల్లోనే బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని ప్రశంసించారు. మహిళల చదువు కోసం నిరంతరం పాటుపడ్డారని తెలిపారు.
ర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి, పేదలను ఆదుకోవడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతుడు ఫూలే అని చెప్పారు. సతీమణి సావిత్రీబాయి ఫూలేతో కలిసి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించి ఏకంగా 52 పాఠశాలలను ప్రారంభించి వేలాదిమంది పేదలకు అక్షర జ్ఞానాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జ్యోతిరావు ఫూలే ఆశయాలకు, స్పూర్తికి భిన్నంగా పాలన కొనసాగిస్తోందని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ పనితీరు దారుణంగా ఉందని తెలిపారు. అక్షరాస్యతలో జాతీయ సగటు కంటే తెలంగాణ పూర్తిగా వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫూలే ఆశయాలను చేతల్లో చూపాలని బండి సంజయ్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





