కుసుమ జగదీశ్ కుటుంబానికి కేసీఆర్ అండ

– ఆయన కుమార్తె మెడిసిన్ విద్యకు ఫీజు చెక్కు అందజేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: బీఆరఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీలో మొదటి నుండి క్రియాశీలకంగా వ్యవహరించిన జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆయన కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని కేసీఆర్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్నారు. ఆమె మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజుకు సంబంధించిన మొత్తానికి చెక్కును ఎర్రవెల్లిలోని తన నివాసంలో సుకీర్తికి శుక్రవారం అందజేశారు. మంచిగా చదువుకోవాలని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సుకీర్తిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *