దొడ్డి కొమురయ్యకు కేసీఆర్ నివాళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన కొమరయ్య అమరత్వం నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటలకు స్పూర్తిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, రాష్ట్రాన్ని సాధించి, అనంతరం పదేండ్లపాటు బాలారిష్టాలను అధిగమించి, స్వయం పాలనను దేశానికే ఆదర్శంగా నిలబెట్టుకోవడంలో అమరుల త్యాగాల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ అన్నారు. తమ ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం, రాజకీయ హక్కుల కోసం తెలంగాణ సబ్బండ కులాల పోరాటాన్ని పాలక ప్రభుత్వాలు గుర్తించి, రాజ్యాంగపరమైన హక్కులను అందించగలిగిన నాడే దొడ్డి కొమరయ్య వంటి ఎందరో తెలంగాణ అమరులు, త్యాగధనులకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లవుతుందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *