– నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిల నియామకం
జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : జగిత్యాలలో ఈనెల 20న జరగనున్న బీఆ ర్ ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జిలను ప్రకటించారు. సభకు జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని ¹పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జిలను కేటీఆర్ ఖరారు చేశారు.
ఇన్‌చార్జిలు వీరే
జగిత్యాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే, జనగామ), కోరుట్లకు వేముల ప్రశాంత్ రెడ్డి (ఎమ్మెల్యే, బాల్కొండ), ధర్మపురికి తక్కల్లపల్లి రవీందర్ రావు (ఎంఎల్సీ), వేములవాడకు బాల్క సుమన్ (మాజీ ఎమ్మెల్యే), చొప్పదండికి పెద్ది సుదర్శన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)లను నియమించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




