– రేవంత్ భాష తీరు దారుణం
– కేసీఆర్‌ను ఉరితీయాలంటే రేవంత్‌ను పదిసార్లు తీయాలి
– హరీష్ రావు బబుల్ షూటర్ మాత్రమే
– మీడియాతో చిట్‌చాట్‌లో కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌ను ఉరితీయాంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ మీద సీఎం వాడిన భాష సరికాదన్నారు. కేసీఆర్‌ను ఒకసారి ఉరితీయాలంటే రేవంత్ రెడ్డిని పదిసార్లు ఉరి తీయాలంటూ మండిపడ్డారు. శాసనమండలి వద్ద శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవుపలికారు. ఈ విషయంలో ఒక కూతురుగా తన రక్తం ఉడుకుతోందన్నారు. నా రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చానన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి అందరి నోళ్లు మూయించాలన్నారు. బీఆర్‌ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీకి రావాన్నారు. బీఆర్‌ఎస్‌లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. సొంత జిల్లా మహబూబ్ నగర్‌కు రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని అని ప్రశ్నించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావునుద్దేశించి కవిత మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఒక బచ్చా అని అన్నారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసునన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ సభకు రాకపోతే హరీష్ రావే అన్నీ చూసుకోవడం సరికాదని, కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కవిత కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





