హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ దినం సందర్భంగా, ముస్లిం సోదర సోదరీమణులకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలతో, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందనిఅన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం గంగా జమున తహజీబ్ కు దర్పణం గా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. రంజాన్ మాస ఉపవాస దీక్షల సందర్భంగా ప్రజల నడుమ శాంతి సామరస్యాలు, సౌబ్రాతృత్వ భావనలు మరింతగా పెంపొందాలని, ఆ దేవుని కృప ప్రజలందరి మీద ఉండాలని కెసిఆర్ అకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





