అభిమాని చిర‌కాల కోరిక నెర‌వేర్చిన కేసీఆర్‌

– ఉద్య‌మకారుడి కుమారుడికి నామ‌క‌ర‌ణం
– జన్మ నక్షత్రం ప్రకారం సుమన్ అని పేరు 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30: తన కుమారునికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదంతో ఆయ‌న‌ చేతుల మీదుగా పేరు పెట్టుకోవాలని ఎదురుచూసిన ఉద్యమకారుల దంపతుల ప్రయత్నం, వైకుంఠ ఏకాదశి పవిత్ర దినం నాడు ఫలించింది. పరిగి నియోజక వర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామ నివాసి దొడ్ల నర్సింహులు తెలంగాణ ఉద్యమ కారుడు. కాగా నర్సింహులు దంపతులు తమ ప్రియతమ నేత కేసీఆర్ గారి తో తన కనిష్ట కుమారునికి నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం బాబు పుట్టిన తొమ్మిది నెలల నుండి ఎదురుచూస్తున్నారు.  ఎట్ట‌కేల‌కు మంగళవారం  నందినగర్ నివాసానికి వెళ్లారు. కుటుంబంతో వచ్చిన దొడ్ల నర్సింహులు అనిత దంపతులను అధినేత కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ ఉద్యమ దంపతుల కోరికను మన్నించి, వేద పండితుని సలహాతో, బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన, ‘సు’ అక్షరాన్ని ఆధారం చేసుకుని సుమన్’ అనే పేరు పెట్టారు. చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి, సంపూర్ణ ఆరోగ్యంతో నూరేల్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆశీర్వదించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *