– దాదాపు 30 వేల ఎకరాల భూములు దోచుకున్న ఘనులు
– పీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9: కేసీఆర్ కుటుంబం అమెరికాలో రూ.40 వేల కోట్లు, దుబాయ్‌లో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని పీసీసీ తెలంగాణ జనరల్ సెక్రెటరీ గజ్జల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 30 వేల ఎకరాల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వొచ్చాయని ప్రశ్నించారు. ఇవన్నీ అబద్దాలని తన కొడుకుపై ప్రమాణం చేయగలరా అని కాంతం నిలదీశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గజ్జల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దుబాయ్‌లో తన బినాని చంపితే ఆధారాలు పోతాయని కేటీఆర్ భ్రమపడ్డారని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ మకాం వేసేవారని తెలిపారు. 2022 జనవరి 24న ఒక హీరోయిన్‌కు కేటీఆర్ రూ.100 కోట్లు ఇచ్చారని, ఒక కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని తాజ్ కృష్ణా హోటల్ 328వ గదికి ఒక హీరోయిన్‌ను పిలిపించి,రూ.35 కోట్ల 75 లక్షలతో విల్లా కొనిచ్చారని, ఆడి కారు కూడా బహుమతిగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. 2022 మార్చి 3న దిల్లీలోని లలిత్ హోటల్ 770వ గదికి మైసూర్‌లో షూటింగ్ చేస్తున్న హీరోయిన్‌ను బెదిరించి పిలిపించుకున్నారని, రూ.50 కోట్లు ఇస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు ఎన్టీఆర్, చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని.. దొంగ పాస్‌పోర్టులు సృష్టించిన చరిత్ర కేసీఆర్‌దేనని గజ్జెల విరుచుకుపడ్డారు. ఎన్నికల కోసం జగన్‌కు రూ.200 కోట్లు.. మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, దిల్లీకి కోట్లాది రూపాయలను కేసీఆర్ పంపారన్నారు. అఖిలేష్ యాదవ్, కుమారస్వామికి కేటీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్‌పై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం వల్లే కేటీఆర్ మంత్రి అయ్యారని, రాహుల్ కాలి గోటికి కూడా ఆయన సరిపోరని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని, కేటీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని గజ్జల కాంతం ప్రశ్నించారు. చట్టాలు, రాజ్యాంగంపై కేటీఆర్‌కు గౌరవం, జ్ఞానం లేదని, చరిత్ర తెలియదని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని, కేటీఆర్ లాగా రాహుల్, రేవంత్‌లు దోచుకోలేదని గజ్జెల పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





