హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత, కె.చంద్ర శేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింసా శాంతి మార్గమని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ మైనారిటీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా అమలు చేశామని తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సెక్యులర్ సంప్రదాయాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేశారు. పీడన నుంచి విముక్తి లభించేలా దీవిస్తూ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని యేసు క్రీస్తును కేసీఆర్ ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




