హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఎమ్మెల్సీ కవితను పార్టీనుంచి సస్పెండ్ చేసిన క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫావమ్‌హౌస్‌లో పార్టీ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తరువాత పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సంజయ్, మాజీ ఎంపీ వినోద్‌లు పాల్గొన్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం బీఆర్‌ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



