హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లి విరిసేలా దీవించాలని గణనాథుని కేసీఆర్ ప్రార్థించారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో ప్రత్యేక పూజలు అందుకుంటారని తెలిపారు. దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణనాధుని నవరాత్రి వేడుకలు పల్లె నుండి పట్టణం దాకా ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు. వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభం అయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ప్రజల్లో మత సామరస్యం, దైవభక్తి, సమష్టి తత్వం మరింతగా బలపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




