వ్యవసాయ సంక్షోభంపై రాజీ లేని పోరాటాలు చేయాలి

– ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతాంగం ఆగమాగం
– బనకచర్ల ప్రాజెక్ట్‌ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందే..
– అందుకు బిఆర్‌ఎస్‌ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి

– పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం

-హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవడానికి వ్యవసాయ సంక్షోభాన్ని నివారిండానికి, రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రాజీలేని పోరాటాలను ముమ్మరం చేయాలని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీ తరఫున క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎర్రవెల్లి నివాసంలో అధినేత కేసీఆర్‌ మంగళవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు పార్టీ సీనియర్‌ నేతలు తన్నీరు హరీశ్‌ రావు, జి. జగదీశ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో… పార్టీ అధినేత పలు సూచనలు, దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అననారు. తమను నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి.. శాశ్వత అన్యాయం వడిగడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహ లాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు అయిపోతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్‌ హౌస్‌ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలి. పంపులను ఆన్‌ చేయాలి. చెరు వులు కుంటలు రిజర్వాయర్లను నింపాలి ్నరాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం దీని మీద పోరాటాలు చేయాలని కేసీఆర్‌ అన్నారు. ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు బిఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న దిశగా… మిగతా అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేసి వాళ్లను క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *