కృష్ణయ్య లేఖపై జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్17:బీసీ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో 18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో బీసీల బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలపాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. అయితే, ఆర్. కృష్ణయ్య లేఖపై స్పందించారు కవిత. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొంటోందని… అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్లు భావించాలా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో బిల్లులు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడకుండా బీసీ రిజర్వేషన్లపై ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ తామే ముందుండి బంద్ చేయిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని కవిత విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



