ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 10 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖమ్మంలో నిరవధిక దీక్ష చేస్తుండగా పోలీసులు భగ్నం చేశారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా ఉండేందుకు సోమవారం ఆమె ఇక్కడకు వచ్చారు. బీస , ఎస్సీ , ఎస్ టీ ఐకాస ఛైర్మెన్ విశారదన్ మహారాజ్ తో కలిసి స్థానిక జడ్పి సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అయిదు గంటపాటు నిరసన చేపట్టడంతో వారిని పోలీసులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీసులు నోటీసులు అందజేయడంతో కవిత, విశారదన్ తిరిగి భూదాన్ బాధితుల పునరావాసం పొందుతున్న స్థానిక అంబేడ్కర్ భవనం వద్ద దీక్ష చేపట్టారు. మంగళవారం వారి దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను హైదరాబాద్ కు తరలించారు. అక్కడ కూడా ఆమె తన దీక్ష ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా కవిత తన సోషల్ మీడియాలో ఖమ్మం పోలీసులు భూదాన్ బాధితులను హెచ్చరిస్తున్న వీడియోను పోస్టు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మంలో నిరసన వ్యక్తం చేసిన వెలుగుమట్ల బాధితులను పోలీసు అధికారుల చేత భయభ్రాంతులకు గురిచేస్తున్న అరాచక కాంగ్రెస్ సర్కార్ అని దుయ్యబట్టారు. ప్రభుత్వం జాగలు ఇస్తుంది అని ఒక ప్రభుత్వ పోలీసు అధికారి చెప్పడం, ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల గురించి అడిగితే బెదిరింపు చర్యలకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




