కాళేశ్వరాన్ని రెండేళ్లుగా ఎందుకు నానబెట్టారో

– ఇప్పుడు రిపేర్లు చేయడంలో ఆంతర్యమేమిటో?
– కమీషన్ల కోసమేనేమో అన్న అనుమానాలు
– రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ జపం
– మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రెండున్నరేళ్లు పంటలు ఎండబెట్టారని ఆరోపించారు. ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే రైతులకు మేలు జరిగి ఉండేదన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ క£మీషన్ల కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారా అని మండిపడ్డారు. మున్సిపల్, అర్బన్ ఫారెస్ట్రీలో తీవ్రమైన అవినీతి జరుగుతోందన్నారు. రియల్ ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్‌కు నష్టం చేయవద్దని కోరారు. అలాగే జీహెచఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోందని కవిత ఆరోపించారు. అనేక గ్రామాలు జీహెచఎంసీ పరిధిలో కలిసినా సరైన అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. హెచఎండీఏ పరిధిలో రూ.35 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని, ఆ మొత్తాన్ని హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించలేదని కవిత ఆరోపించారు. హెచఎండీఏకు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. 2017 నుంచి 2021 వరకు రూ.480 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మరో రూ.1,140 కోట్లను అదే పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారని వెల్లడించారు. ఇది ఆర్థిక శాఖ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. రూ.50 కోట్ల టెండర్ వేస్తే దాదాపు 50 శాతం తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని, కానీ నామినేషన్ పద్ధతి అవినీతికి దారితీస్తోందని ఆరోపించారు. నర్సరీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఆరు వేల మంది స్కిల్డ్ లేబర్‌కు రూ.23,800లు ఇవ్వాల్సి ఉందని కవిత తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఒక కంపెనీపై సీఎం రేవంత్ రెడ్డి సిట్ వేయించారని, తర్వాత ఏమైందో తెలియాలని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డులో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టును రేవంత్ రెడ్డి సీ¾ఎం అయ్యాక కూడా కొనసాగిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆరోపణలు చేసిన రేవంత్ దీనిని ఎలా కొనసాగిస్తారన్నారు. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నారని, సీఎం దగ్గర బ్యాగులు మోసే వ్యక్తి చెప్పినట్టు మాత్రమే పనులు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. జీహెచఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలనలో జరుగుతున్న మహా అవినీతి అని వ్యాఖ్యానించారు. ఈనెల 25న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 కమిటీలు వేశామని కవిత చెప్పారు. 500 మంది వలంటీర్లు సేవలందిస్తారని తెలిపారు. కాగా, మహిళా బిల్లు అమలు కాకపోవడంతో 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు నష్టపోయారని చెప్పారు. 2027 జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ మోసాలను కేరళం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తాము వీడియో రిలీజ్ చేశామని కవిత తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *