– దీక్ష విరమించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నిరాహార దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించిందని చెప్పారు. దీంతో తాను చేపట్టిన ఈ దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపుతూ బీసీల తరఫున పోరాటం చేస్తున్నామని చెప్పారు. మేము ఒక్క అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు వేస్తామని కవిత చెప్పారు. కోర్టు తీర్పును గౌరవించి ఈ దీక్షను ముగిస్తున్నామన్నారు. ఈ పోరాటం ఆగదని అనేక రూపాల్లో చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో సాధించేదేమీ లేదన్నారు. రాష్ట్రపతి వద్దకు వెళ్లండంటూ ప్రభుత్వంలోని పెద్దలకు ఆమె సూచించారు. అంతకుముందు ఆమె ఇందిరా పార్కు వద్ద దీక్షకు దిగారు.





