తమిళనాడు, జులై 25: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు తమిళనాడు నుంచి డీఎంకే తరపున పి.విల్సన్, సల్మా, ఎస్.ఆర్.శివలింగం, మరో ఇద్దరు కూడా ప్రమాణస్వీకారం చేశారు. గత జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరు డీఎంకే కూటమి మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమల్ తమిళలంలో ప్రమాణం చేశారు. కాగా, 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించిన కమల్‌హాసన్ 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమికి మద్దతు ప్రకటిస్తూ డీఎంకేకు తమ పార్టీ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించగా డీఎంకే పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నాలుగు రాజ్యసభ స్థానాలనూ ఆ పార్టీనే దక్కించుకుంది. పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించగా కమల్‌హాసన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభ్యుడిగా కమల్ ప్రమాణస్వీకారం





