సీపీఐ నేత గిరిప్రసాద్ సతీమణి కమలాదేవి కన్నుమూత

– సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: సీపీఐ అగ్ర నాయకుడు నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కమలాదేవి భౌతిక కాయాన్ని బంధువులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆమె పెద్ద కుమార్తె నివాసంలో ఉంచారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కమలాదేవి మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. ఆమె తన భర్త గిరిప్రసాద్ వెంట నడిచి ఆయన పోరాటంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *