బిఆర్‌ఎస్‌ నిలదీస్తే గానీ కదలరా..

– కల్వకుర్లి మోటర్లు ఆన్‌ చేయడం మా ఒత్తిడే
– మాజీ మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 8: ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్‌ చేసి నీళ్లు విడుదల చేయడం బిఆర్‌ఎస్‌, కేసీఆర్‌ విజయం అని మాజీ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ నిలదీస్తే గాని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కదలిక రాదా.. తాము ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తు రావా అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షలాదిగా రైతులతో తరలి వచ్చి మోటార్లు ఆన్‌ చేస్తామంటే గాని చలనం రాదా అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ఎగువ రాష్టాల్ర్ర నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సింది పోయి విడిచిపెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఇకనైనా రాజకీయ కక్షసాధింపు చర్యలపై దృష్టి పెట్టడం మానేసి రైతాంగంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కల్వకుర్తి వలె కాళేశ్వరం మోటార్లు కూడా ఆన్‌ చేసి రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని బీఆర్‌ఎస్‌ పక్షాన హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *